
సావిత్రి భాయి పూలే జయంతి ని మహిళ ఉపాధ్యాయుల దినోత్సవం గా ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్లు టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం తీస్కున్న ఈ నిర్ణయం అన్ని వర్గాల ప్రజలు స్వాగతించాల్సిన విషయం అన్నారు.. సావిత్రి బాయి పూలే మహిళల ను అక్షరాస్యులను చేయడానికి ఎంతో శ్రమించారని ఆమె త్యాగాన్ని, కృషిని గుర్తించడం చాలా సంతోషకరమైన విషయం అన్నారు.